పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

243

35వ అధ్యాయము.

688. పూర్వ సంస్కారబలము యెంత గొప్పదో చూచితిరా! ఒకానొకచోట కొందఱు సన్యాసులు కూర్చుండి యుండిరి. అప్పుడొక పడుచు ఆత్రోవనువచ్చినది. అందఱును తమ దైవధ్యానములందే నిమగ్నులైయుండిరి; ఒక్కడు మాత్రము రహస్యముగ ఆమెవంక చూడ్కి నిలిపినాడు. ఇట్లా స్త్రీసౌందర్యముచే ఆకర్షింపబడిన యతడు పూర్వము గృహస్థుడై యుండి, సన్యాసమున ప్రవేశించునప్పటికి మువ్వురుబిడ్డల కనియున్నవాడు.

689. సంసారవ్యావృత్తియందు మునగియున్నవానికి బ్రహ్మజ్ఞానము అబ్బదు. వానికి భగవత్సాక్షాత్కారము కాజాలదు. బురదనీటిలో చుట్టునున్నచెట్లుమున్నగునవిగాని సూర్యుడుగాని ప్రతిఫలింపజాలునా?

690. ఐహికరతునకు ఎన్ని దుఃఖములువచ్చినను, ఎన్ని కష్టములు వాటిల్లినను, ఎన్నడును జ్ఞానము రాబోదు. ఒంటెలకు ముండ్లతుప్పలు ఇష్టము. అవి వానిని మేసినకొలదిని నోట నెత్తురు కారుచుండును. అయినను అవి ముండ్లతుప్పలనే తినునుగాని మానవు.

ఒక్కొకప్పుడు గృహస్థులగతి ఉదుమును పట్టుకొనిన పామురీతి నుండును. అది ఉడుమును తినజాలదు, విడువను జాలదు. గృహస్థుడు సంసారములో సారమేమియు లేదని గ్రహించవచ్చును. సంసారము గుజ్జనునదిలేక ఎండిపోయిన తోలు టెంకమాత్రము మిగిలిన పుల్లమామిడిపండును బోలియుండును. అయినను ఈసంసారులు దానిని త్యజించి భగ