పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

240

నడుమనో ఉన్నంతకాలమును ధర్మచింతలతోపరవశులుగ కాన్పింతురు; ఆసహవాసము తొలగించినపిమ్మట భక్తిభావమంతయు శూన్యమైపోవును.

675. ప్రశ్న:- సంసారులు సర్వమును త్యజించి భగవంతునికొఱకై ఏల పరుగిడజాలరో?

ఉ:- నరులు వేర్వేఱువేషములనుదాల్చినటనలు చేయు నాటకరంగమువలె యీప్రపంచమున్నది. కొంతకాలముతమ ఆటలను సాగించనిది వీరు తమవేషములను తొలగించుకొన జాలరు. కొంతకాలము వారియాటలను వారి నాడనిండు! అంతట వారే తమవేషముల చాలింపగలరు!

676. మొసలికి ఏఆయుధమును భేదింపజాలని గట్టిపొలుసుతోనేర్పడిన కవచముకలదు. గృహవ్రతు లట్టివారు. వారికి నీవెన్నిపారమార్థికబోధలు చేసినను; అవి వారిహృదయమున జొచ్చజాలవు.

677. వంతెనక్రింద నీరు ఒకవైపునుండిచొచ్చి రెండవవైపునుండి వెడలిపోవురీతిని గృహస్థులకు చేయు ధర్మబోధ ఒకచెవినుండిదూరి రెండవచెవిగుండ జారిపోవును. అందేమియు దానిజాడయైన నిలువబోదు.

678. దుఃఖములును జీవనవ్యధలును గాఢముగా నెత్తిపై బడి మొట్టునుగాక, సంసారనిమగ్నులు కామినీ కాంచనములపై మోహమును సులభముగ నిగ్రహించి, మనస్సును భగవంతునివైపు త్రిప్పనొల్లరుగదా!