పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

239

35వ అధ్యాయము.

671. ఈప్రపంచములో తమకు ఆకర్షవంతమగునదేమియు లేకున్నను, ఏదో విధమగు తగులాటమును కల్పన చేసికొని అందులో చిక్కుకొను మనుష్యులు కొందఱుందురు. తన పోషణకోరు కుటుంబముగాని, తన రక్షణ అవసరమగు బంధువులుగాని లేని మానవుడు ఏదియో పిల్లినో, కోతినో, కుక్కనో, పిట్టనో పెంచ నారంభించి దానితో లీలలు సలుపుచుండును. పాలకొఱకగు పరతాపమును తేట చల్లనీటితో చల్లార్చుకొనజూచునట్లు! మాయ మానవజాతిపైని పడవేయుటవల్ల చమత్కార మిట్టిది!

672. మెత్తనిరేగడపైని ముద్ర పడునటుల రాతిపైని పడదుగదా! అటులనే భక్తుని హృదయముపైని పరమార్థ జ్ఞానము అంకిత మగునటుల; బద్ధాత్ముని హృదయముపైని నాటదు.

673. సంసారానురక్తునియందు పారమార్థికమగు సర్వము నెడను వానికిగల వెగటు ప్రస్ఫుటముగ గోచరించును. భక్తి గీతమునుగాని, స్తోత్రమునుగాని, తుదకు భగవన్నామమును గాని అతడు విననొల్లడు; అంతట పోక యితరులనుగూడ నిరుత్సాహముచేసి మాన్చును. ఎవడు ప్రార్థనల నిరసించునో, సజ్జనసంగములను సాధుపురుషులను నిందించునో, అట్టివాడు ప్రపంచమునకు దాసుడు!

674. కొలిమిలోబాగుగ కాలుచున్నంతవఱకును ఇనుము ఎఱ్ఱగకాన్పించును; కాని అందుండి తొలగినపిమ్మట నల్లబడును. సంసారులును యిట్లేయుందురు. తాము దేవళములోనో, భక్తుల