పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34వ అధ్యాయము.

గృహస్థులకు హితబోధ.

631. ఒకస్తంభమును పట్టుకొని పడిపోదుననుభయము లేకుండ వడిగ గిఱగిఱతిరుగు బాలునితీరున భగవంతుని స్థిరముగ బట్టుకొని, నీసాంసారిక ధర్మముల నిర్వర్తించుకొనుచుండుము; నీకు అపాయముండదు.

632. ప్రశ్న: - ఏదినమున కాదినము, తిండికై పాటుపడవలసిన నేను, ప్రార్థనాది కర్మలను ఎట్లు నిర్వర్తించగలను?

ఉ:- నీవు ఎవరికొఱకై పాటుపడుదువో ఆతడే నీఅవసరముల దీర్చును. నిన్నీలోకమునకు పంపుటకు పూర్వమే భగవంతుడు నీపోషణకు ఏర్పాటుల చేసియున్నాడు.

సంసారపరిశోధనలందుజిక్కి జీవించుచును పూర్ణతను సాధించు నాతడు మహావీరుడనదగును.

633. ప్రశ్న:- ప్రకృతిని భగవంతునికిని సామరస్యము కుదుర్చుటెట్లు?

ఉ:- ఆవైశ్యవనితను చూడుము. ఆమె ఎన్నివిధముల పనులు చక్క పెట్టుచున్నదో! రోటిలో అటుకులువేసి ఒకచేత రోకలిపూనిదంచుచున్నది; రెండవచేతితో బిడ్డనుసాకుచున్నది. మఱియు అటుకులుకొనవచ్చినవారితో బేరమాడుచున్నది. అటుల ఆమె అన్నిపనులు చేయుచున్ననుకూడ, రోకలిజారి