పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

217

32వ అధ్యాయము.

ఉ:- ఎవడు రేపు తానేమితినునో, ఏమిధరించునో అనుచింతలేక ప్రాపంచిక విషయములను పూర్ణముగ విడిచి వేయునో అతడు నిజముగ సన్యాసి అగుటకు తగినవాడు. ఎత్తగు చెట్టునెక్కి తనప్రాణమునకును అవయవములకును ఏమి అపాయము కలుగునో అనుచింత యిసుమంతయు లేక, అవసరమగునేని ఆఉన్నత స్థలమునుండి నిర్భయముగా క్రిందికి దుముకు మనుష్యునివలె నుండును.

619. సన్యాసియొక్క శిక్షణా విధానము చాలకఠినమైనది. అయినను ప్రజల కతడు బోధకుడుగనుండు వాడు కావున అట్టి కఠినశిక్షణమును పడవలయును. ప్రజలు వాని జీవనసరణిని ఆదర్శమును గాంచియే జ్ఞానమును పొందవలసియున్నది. అట్టివాడు స్త్రీలున్నచోట ఉండకపోవుటేగాక, వారి రూపపటములనైనను చూడతగదు. ఆశిక్షణము అంతకఠినమైనది!

620. ఒకడు సన్యాసుల కావివస్త్రమును ధరించినప్పుడు, అతడు నిజమగు సన్యాసివలె అనగా సాధువువలె వర్తించవలయును. నాటకములో రాజువేషమువేసినవాడు సరిగా రాజు వలెను, మంత్రివేషమువేసినవాడు సరిగా మంత్రివలెను. నటించుటను మీరు చూడలేదా? ఒకసారి పగటివేసగాడు సన్యాసివేషము వేసికొని గ్రామాధిపతి యింటికి వచ్చెను. ఆగ్రామనాయకుడు వానికొక ధనపుసంచిని బహుమాన మీయబోయినాడు. ఆతడు దానిని పుచ్చుకొనుటకు నిరాకరించి వెడలిపోయెను. కొంతసేపటికి తనవేషమును తీసివేసి, బూడిదను కడిగికొని మరలవచ్చెను. గ్రామాధికారి యియ్య