పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

213

31వ అధ్యాయము.

అయోగ్య విషయములనుండి వేఱుచేసి సద్విషయములను చేకొనగలరు.

609. ప్రశ్న:- ఇంద్రియలోలతయు, ఐహికసుఖవాంఛయు, ఎప్పుడు నశించును?

ఉ:- అఖండబ్రహ్మానంద సాగరుడగు పరమాత్మయందు సర్వసుఖములును, సర్వానందములును, పర్యవసించును. దేవునియందానందము ననుభవించువారు అల్పమును తుచ్ఛమును అగు ఐహికభోగములను మెచ్చుకొనజాలరు.

610. ఆవులమందలోనికి అన్యజంతువేదియైన చొఱబడినయెడల, ఆఆవులు కొమ్ములతో కుమ్మియు, గిట్టలతోతన్నియు దానిని తఱిమివేయును. కాని మఱొక ఆవే వచ్చినయెడల అవన్నియు చుట్టుచేరి దానితో నెయ్యమునుజూపి ఒకదాని నొకటి నాకుకొనును. అటులనే భక్తుడు వేఱొకభక్తుని కలిసికొనినప్పుడు యిరువురును మహదానందమును పొంది, యెడబాటునకు ఓర్వకుందురు. కాని అవిశ్వాసియొకడు తమతో చేరెనేని వారందఱుచేరి వానిని దూరముగ వెడల నడుపుదురు.

611. భగవద్భక్తుడు ఏకాంతవాసమన యిష్టపడకుండుటేల?

జవాబు:- గంజాయి త్రాగునతడు సహవాసగాండ్రు లేకుండ పొగత్రాగి ఆనందింప జాలడు. అటులనే భగవద్భక్తుడు బాగవతసంగము లేకుండ దూరముగ నెక్కడనో