పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

212

604. పారమార్ధిక చింతగలవారు, సంఘాచారముల కతీతమగు ఒకకూటముగ నేర్పడుదురు.

605. స్త్రీ అనుదినము తనభర్తతో నడుపు ముచ్చటలను బయటికి చెప్పుటకు సిగ్గుపడును. ఆ రహస్యములను ఆమె ఎవరితోడను చెప్పదు; చెప్పుటకిష్టముపడదు. ఒకవేళ కర్మము చాలక అది బయలుపడెనా తహతహపడును. అయినను తన ప్రాణసఖితో మాత్రము దాపరిక మింతయు లేక సర్వమును చెప్పును. ఇంతేగాదు అట్టి సఖితో చెప్పుటకై ఆరాటపడును; చెప్పగల్గినప్పుడు అత్యానందము నందును. అదేతీరున భగవద్భక్తుడు తానీశ్వరసన్నిధిని అనుభవించిన బ్రహ్మానందమును గురించి నిజమగుభక్తునికితప్ప యితరులకు తెలుపనిచ్చగింపడు; మఱియు అట్టిభక్తునికి తనఅనుభవములను తెలుపుటకు ఆతురపడుచు, అటుల జరిగినప్పుడు ఎంతయోసంతసించును.

606. రాజునే తనప్రియుడుగా గలిగినస్త్రీ దరిద్రునిప్రేమింపదు. అటులనే భగవంతుని కృపావీక్షణముల బడసిన నరుడు సాంసారిక తుచ్ఛభోగములకు ఆశపడజాలడు.

607. చేట తేలిక యై పనికిమాలినపదార్ధములను ఎగురకొట్టివేసి ఘనమై ఉపయోగపడు పదార్ధములను తనలోనిలుపుకొనును. ఉత్తమనరుల లక్షణము అటులుండును.

608. ఇసుకయు, పంచదారయు కలసియుండినను, చీమ యిసుక రేణువులనువిడిచిపెట్టి పంచదారనే తీసుకొనును. అటులనే పావనమూర్తులగు పరమహంసలును సాధుసత్తములును