పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

211

31వ అధ్యాయము.

భగవంతుడు మనను కాపాడగలడు." అని జ్ఞానిపలికెను. "సోదరా! అటులకాదుసుమీ! పరుగెత్తి పోదుమురమ్ము! మనయత్నముచేతనే కాగలపనికై భగవంతునికి శ్రమకలిగించుటెందుకు?" అని భక్తుడు పలికెను.

600. పాము భీకరవిష జంతువు; దానిని పట్టుకొనబోయినవానిని కఱచును. కాని పాముమంత్రము నేర్చిన యతడు, చాలపాములను సులభముగ పట్టుకొనుటేగాక, వానిని ఆభరణములవలె కంఠమునను హస్తములందును అనేకములుగా వ్రేలవేసికొనగలడు. అటులనే పారమార్ధికజ్ఞానము కలవాడు లోభమోహముల విషముచేత భంగపడడు.

601. తామర లేచినచోట గోకినకొలదిని దురద హెచ్చు చుండును; ఎంతగోకిన అంత సుఖముగానున్నట్లు తోచును. అట్లే ఈశ్వరారాధకులు భగవస్తోత్రముల పాడుటతో తృప్తిచెందరు.

602. భగవన్నామస్మరణ మాత్రాన ఎవని శరీరము పులకరము పొందునో, ఎవని నేత్రములు ఆనంద భాష్పములతో నిండునో అట్టివానికి అది తుదిజన్మ!

603. మంచికలకండను రుచిచూచినవాడు బెల్లపుతెట్టెను తిని ఆనందింప జాలడు. సుందర మందిరములందు నిద్రపోవువాడు పెంటకుప్పలపై పరుండి సంతసింప జాలడు. అటులనే బ్రహ్మానందమును రుచుచూచినవాడు సంసారిక సుఖములందు సంతుష్టి నందజాలడు.