పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

199

28వ అధ్యాయము.

పును నాశముచేయుచున్నది సుమీ!" అని ప్రతిపలికినాడు. అటులనే జ్ఞానాగ్నిచేత మనస్సుతప్తమగునేని, దాని నైజగుణమునశించి యది బంధకముగనుండుట మానును.

569. లక్షలాదిగ ఎగురవేయు గాలిపటములలో ఒకటి రెండుమాత్రమె, దారముత్రెంపుకొని స్వేచ్ఛనుపొందును. అదేవిధమున ఎన్నివందలమందియో సాధకులలో ఒకరిద్దరు మాత్రము సంసారబంధములనుండి విముక్తులగుదురు!

570. దయ్యముపట్టినమనిషి తనకు గ్రహముసోకినట్లు గ్రహించగానే, ఆదయ్యము విడిచిపారి పోవును. అటులనే మాయచే ఆవేశితమైన జీవాత్మ తననుమాయఆవేశించినటుల తెలియగానే, ఆమాయ విడిచిపోవును.

571. వేయించిన వరిగింజలు నేలపైనిచల్లినచో మొలక యెత్తవు; వేయించని పచ్చివడ్లుమాత్రమే మొలుచును. అదేరీతిగ ఒకడు సిద్ధదశనుపొంది మరణించినయెడల మరల జన్మనెత్తనగత్యము లేదు; ఆసిద్ధదశయందే మరణించునతడు, సిద్ధత్వమును పొందువఱకును, మరలమరల జన్మించుచునే యుండును.

572. మనస్సే సర్వమును! మనస్సుకు స్వాతంత్ర్యము పోయెనా నీకును పోవును. మనస్సు స్వేచ్ఛగనుండెనా, నీవును ముక్తుడవే; అప్పుడునానిపినతెల్లనిగుడ్డవలె మనస్సునుఏరంగులోనై ననుముంచవచ్చును. ఆంగ్లభాషచదివినయెడల, నీనిశ్చయమునకు విరుద్ధముగకూడ నీప్రసంగములో ఆంగ్లశబ్దములు చొచ్చకుండ ఆపలేవు. సంస్కృతముచదివిన పండితుడు శ్లోకములను