పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

196

562. ప్రశ్న:- సమాధిఅవస్థయందు దృశ్యప్రపంచజ్ఞానము (పరమహంసులవారికి) ఉండునా?

జవాబు:- సముద్రములోపల గుట్టలు, పర్వతములు, గుహలు, లోయలు, కలవు కాని అవి పైకికానరావు. అటులనే సమాధి అవస్థయందు యతివిశాలమగు సచ్చిదానంద మహాసాగరము కానవచ్చును. వ్యక్తిజీవభావము దానిలో అణగిపోయి అవ్యక్తరూపమున నుండును.

563. ప్రశ్న:- దేవుడు నరుని హృదయమున ప్రవేశించుచో సూచనలెటులుండును?

జవాబు:- అరుణకాంతులు సూర్యునిరాకను ముందుగ సూచించు విధాన, స్వార్ధత్యాగము, అమలత్వము, సచ్ఛీలము అనునవి స్వామిరాకను ముందుగ తెలుపును.

564. రాజు సేవకునియింట విందారగింపబోవుచో, తన భాండారములనుండియే. ఆసనములు, అలంకారములు, భోజ్య పదార్థములు, సమస్తమును ముందుగ సేవకుని యింటికి పంపును. అప్పుడు సేవకుడు తనస్వామికి తగినటుల మర్యాదలుచేసిగౌరవించును. అట్లేభగవంతుడు రానున్నప్పుడు ముందుగనె భక్తిని, గౌరవమును, విశ్వాసమును, సద్భక్తుని హృదయమునందు ముందుగప్రవేశపెట్టును.

565. పరుశవేదితాకున బంగారముగ మారినయినుమును నేలలో పాతిపెట్టవచ్చును. లేదా పెంటకుప్పలో పాఱవేయవచ్చును. అది బంగారుగనే నిలిచియుండునుగాని పూర్వపు