పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27వ అధ్యాయము.

ఆత్మావలోకనదశ.

550. ప్రశ్న:- సమాధిదశయందు మనస్సుయొక్క స్థితి ఎటుండును?

జవాబు:- కొంతసేపు నీటివెలుపల నుంచబడిన చేప తిరిగి నీటవిడువబడినప్పుడు, ఎట్టిఆనందమును అనుభవించునో, అట్టి స్థితిలో నుండును.

551. పరుశువేదిని తాకిన ఉక్కుకత్తి బంగారుగ మారును. అప్పుడు దాని ఆకారము మారకున్నను ఉక్కుకత్తివలె దేనిని ఛేదింపజాలదు. ఆతీరుననే భగవత్పాదారవిందముల తాకిన మనుజుని పైరూపుమారకున్నను, అత డేదుష్ట కార్యమును చేయనోపడు.

552. అది ముందుకు వెనుకకు పోవుచుండుస్థితి. నీవు పరబ్రహ్మమునకై మరలిపోవుదువు; నీవ్యక్తిత్వము ఆబ్రహ్మభావమున కలిసిపోవును; అదియే సమాధి: ఆపిమ్మట నీవు తిరుగుముఖము పెట్టుదువు. నీవ్యక్తిత్వమును నీవుపొంది, నీవు మొదట ప్రస్థానము (ప్రయాణము) సాగించిన తావునకు వచ్చి చేరుదువుకాని నీఆత్మ అల పరమాత్మనుండి పుట్టినదే యనియు, ఆయేకైక సత్పదార్ధమునుండియే ఈశ్వరుడు, నరుడు, ప్రకృతి అనునవి అంశరూపమున పుట్టునవనియు తెలిసిపోవును. కాబట్టి నీవా రూపాంతరము లందొక్కదాని