పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

189

26వ అధ్యాయము.

మీరు వూరకకూర్చుండి, ఏమియు ప్రయత్నమేసేయక భగవంతుని చూపుమని మీరు నన్నడుగుచున్నారా; పెరుగు తోడుపెట్టి, వెన్న చిలికి, మీనోటికి అందియ్యవలయునా! చేపను పట్టుకొని మీచేతిలో పెట్టవలయునా! మీకోరిక ఎంత విపరీతముగ నున్నదో చూచితిరా!

548. ఒకడు రాజనగరులోనికి పోయి రాజును చూడవలె ననిన, అతడు నగరును సమీపించవలెను; ద్వారములను అన్నిటిని దాటవలెను. అటులగాక వెలుపలి గుమ్మము దాటగానె "రాజక్కెడ? అనినచో వానికిరాజు కానరాడు. అతడు సప్తద్వారములను దాటినగాని రాజును చూడలేడు.

549. ప్రశ్న - ఎట్టికర్మనుచేసి భగవంతుని చేరవచ్చును?

జవాబు:- కర్మలందు బేధములేదు. ఈకర్మచేసిన భగవంతుని చేరవచ్చును, ఆకర్మచేసినభగవంతుని చేరలేము అని తలంచరాదు.

సర్వమును భగవంతుని అనుగ్రహముపై నాధారపడి యుండును. వాని అనుగ్రహము కావలెనా, నిష్కపటమైన తీవ్రవాంఛతో నీకర్మను నీవు నిర్వహించుము. భగవదనుగ్రహమువలన నీపరిస్థితులు అనుకూలములు కాగలవు. వాని దర్శనమగుటకు వలయుమార్గములు చక్కబడగలవు. నీవు సన్యసించకోరి, ఒక వేళ నీమీద నొకసంసారము ఆధారపడి యున్నయెడల నీతమ్ముడు ఆభారమును వహించగలడు.