పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

186

541. కొన్నిచేపలకు చాల ఎముకల గూడులుండును. కొన్నింటికి ఒకే ఎముకల గూడుండును. కాని చేపలనుపట్టి తినువారు ఒక ఎముకలగూడుయున్నను హెచ్చుగనున్నను, ఎముకలను అన్నింటిని తొలగించివేతురు. అదేతీరున కొందఱి పాపములు విశేషముగనుండును, కొందఱిపాపములు కొలదిగ నుండును. కాని ఈశ్వరానుగ్రహము లభించెనా అవిఅన్నియు తొలగింపబడి, వారు పవిత్రులుగ చేయబడుదురు.

542. నడిసముద్రమునపోవు ఓడకంబము మీద ఒకపక్షి మూర్చుండెను. అచ్చట చాలసేపు కూర్చుండుటకు విసుగు కొని క్రొత్తచోటవ్రాలుటకై ఎగిరిపోయినది. కాని వాలుటకు తగినతావుగానక అలసిపోయినదై తిరిగి మొదట ఓడ కంబమునేచేరెను. అటులనె సామాన్యసాధకుడు తనక్షేమము కోరునట్టియు అనుభవశాలియుఅగు గురువుచూపిన శిక్షణయు సాధనలును చిరకాలము సాగించుటకు విసుగుచెందును; నిరాశుడగును; గురువునందు లక్ష్యము విడుచును: స్వంతముగ ప్రయత్నించి భగవంతునికనుగొందుగాక యను ధైర్యముతో లోకమున జొఱబాఱును. ఇటుల చాలకాలము వ్యర్ధపుత్రోవలబోయి గతిగానక పూర్వపు గురుని కృపను ఆశ్వీర్వాదమునుపొందుట కొరకై తిరిగి వచ్చును.

543. ఆకస్మికముగ ఏమియుసంభవించదా?

జవాబు:- లేదు. సాధారణముగా దీర్ఘ సాధనలు సాగించక ఎవడును సిద్ధత్వమును పొందడు. ద్వారకనాధమిత్రగారు ఒక్కదినములో ఉన్నతన్యాయాధికారి కాలేదు. ఆయన