పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

178

అనురాగము భగవంతునియెడ కలిగినప్పుడేభక్తిలభ్యపడును. నిష్కళంకభక్తిఅలవడుట మహాదుర్లభము. భక్తియందుమనస్సును ఆత్మయు భగవంతునియందే లయముగాంచవలయును ఆపిమ్మట (పరమోత్తమభక్తియగు) భావభక్తిఅలవడగలదు. "భావము" నందునరునకువాగ్బంధన మగును. శ్వాసయునిలిచి పోవును. కుంభకము తనంతనదియే అమరును. లక్ష్యమున గురుపెట్టి బాణమువేయువాని వాక్కును శ్వాసయు స్తంభించి పోవునటులనే అగును.

522. గోపికలనుగూర్చి ముచ్చటించుచుశ్రీపరమహంసులవారు "మ" అను శిష్యునితో యిట్లనిరి:-

"వారల అనురాగము ఎంతచిత్రమైనదో! తమాల వృక్షమును చూచినంతనే వారలకు ప్రేమోన్మాదము పట్టెడిది. (తమాలవృక్షదర్శన మాత్రాననే రాధకు శ్రీకృష్ణుని నీలవర్ణము జ్ఞప్తికి వచ్చెడిది)

"మ":- గౌరాంగదేవునికిని యిట్లే! ఎదుట అడవి కాంపించగానె ఆయన దానిని బృందావనమని భావించినాడు.

పరమహంస:- ఓ! అట్టిప్రేమావేశమున ఒక్క లేశము ప్రసాదముగ లభించెనా! ఎంతటి భక్తి అది! అటువంటి శ్రేష్ఠభక్తి వారియందునిండి పొర్లిప్రవహించినదిగదా!

523. రాధయు కృష్ణుడును దివ్యావతారములని నమ్మినను లేకున్నను విశేషమేమియులేదు. (హిందువులు క్రైస్తవులు నమ్మునటుల) దేవుడు అవతారము పొందివచ్చునని ఒకడు నమ్మవచ్చును. (ఈకాలపుబ్రహ్మసమాజమువారివలె) దేవుడు మానవ రూపము తాల్చునని నమ్మకపోవచ్చును. కాని భగ