పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

173

25వ అధ్యాయము.

స్మరణచేయుట, కొన్ని సమయములందు ఉపవాసముచేయుట, కొన్ని ప్రత్యేకపూజాద్రవ్యములతో అర్చనలుచేయుట, కొన్ని తీర్థయాత్రలుచేయుట, ఇత్యాది విధులు వైధికభక్తికి లక్షణములు. ఇట్లు చాలాకాలము సాధన జరిపినయడల పై తరగతిదగు "రాగభక్తి" అలవడును. అనురక్తి యిందు ప్రధానముగ కావలసినది. సాంసారికభావములు పూర్తిగ పోవలయును. మనస్సు భగవంతునిపైననే పూర్ణముగ స్థిరపడవలయును. అప్పుడుగాని వానిని చేరుట సాధ్యముకాదు. రాగభక్తిలేక భగవంతుని ఎవడును చేరలేడు.

511. స్వాభావికముగనే ఈరాగభక్తికలవారు కొందఱుందురు. ప్రాయికముగా వారికది పసితనమునుండియే అలవడనగును. అట్టివారు ప్రహ్లాదునివలె శశైవమునుండియు భగవంతునికొఱకైపరితపించుచు రోదనములుచేయుదురు. వారు నిత్యసిద్ధుల తరగతిలో చేరినవారు. సిద్ధాత్ములై జనించినవారు.

512. ప్రశ్న:- భగవంతునికొఱకై భక్తుడు సర్వమును త్యాగముచేయుటెందులకు?

జవాబు:- శలభము దీపమును చూచినతోడనేచీకటి నుండి పర్విడును. చీమ పానకములోపడి ప్రాణమైన విడుచునుగాని, తొలగి చనదు; అదేతీరున భక్తుడు నిరంతరము భగవంతుని కౌగిటజేరి సమస్తమును విడుచును.

513. భగవద్భక్తి రెండు రకములు:-