పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

172

పెద్ద మంచుగడ్డ లేర్పడును; వానిలో ఓడలు చిక్కుకొని కదలక నిలిచిపోవును:- (అటులనే భక్తిమార్గమున కొంతదూరముపోగా నరులును చిక్కుకొని పోదురా?)

అవును; నిజమే. అయినను సేగిలేదు. వీరినిచిక్కబట్టుమంచు సచ్చిదానంద సాగరపుజలము ఘనీభవించగా ఏర్పడినది! బ్రహ్మసత్యము; జగత్తు మిధ్యఅను తర్కమును పూనుదు రేని ఆజ్ఞానసూర్యతాపముచేత ఆమంచుకఱగును.

తరువాత ఏమిమిగులును?

సచ్చిదానందసాగరజలము మాత్రమే, ఆకారశూన్య మగునది మిగులును.

508. జ్ఞానప్రాప్తి పిమ్మట సయితము నారదుడు మొదలుగాగల ఆచార్య వర్గము లోకసంగ్రహణార్థము (లోకజనులకుఉపాకారము చేయునిమిత్తము) భక్తిమార్గమును అవలంభించిరి.

509. ఎందువలననో తెలియకుండనే భగవంతునియందు అనురాగముపూనుటకలదు. ఇదిప్రాప్తించెనా యింకవాంఛింపదగినదేమియుండదు. అట్టిభక్తిగల్గినవాడిటులనును.

"ఓదేవా! నాకు సంపదలువలదు. ఖ్యాతివలదు, ఆరోగ్యమువలదు, సుఖమువలదు. ఇట్టిదేమియు వలదు. నీపాదారవిందములందు నిర్మల భక్తిని మాత్రము ప్రసాదించుము."

510. నైధి భక్తినాబడు ఒకరీతి భక్తికలదు (ఇది శాస్త్రపద్ధతిని విధింపబడిన భక్తి). ఇన్నిపర్యాయములు భగవన్నామ