పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

171

25వ అధ్యాయము.

దేవునివంటి ఈశ్వరావతారములును, ఈశ్వరాంశులగు వీరి పరమభక్తులును, ఈవర్గమునకు చెందినవారే.

505. ప్రేమకు విశిష్టలక్షణములు రెండుగలవు: ఒకటి బాహ్యప్రపంచ విస్ఫురణము; రెండవది, శరీరము యొక్క మై మఱపు:-

506. ఒకనికి సూటియైన మార్గము తెలియకున్నను, భగవద్భక్తియు, భగవంతుని తెలిసి కొనవలయునను తీవ్రవాంఛయు నుండవచ్చును. అట్టివాడు తనభక్తియొక్క ప్రభావము వలననే భగవంతుని చేరజాలును. ఒక మహాభక్తుడు జగన్నాధమును దర్శింప పయనమైనాడు. పూరీ జగన్నాధమునకు త్రోవ నెరుంగక ఆవైపునకు పోవుటకుమారుగా వేరుత్రోవను నడువసాగెను; కాని మిగుల నాతురపాటుతో తనకు త్రోవలో కనుపించిన వారినెల్ల అడుగుచు పోయెను. వారందఱును "ఇదిత్రోవకాదు. అల్లదిగో త్రోవ అట్లున్నది" అని చెప్పసాగిరి. ఎట్టకేలకు ఆభక్తుడు పూరి నగరముజేరి కృతార్థుడయ్యెను. అటులనే ఒకనికి యిచ్చయుండి, మార్గము తెలియకున్నను తొందరలేదు. వానికి ఎవరోత్రోవ జూపువారు దొఱుకుదురు: ప్రధమములో ఒకడుపొరబడినను, తుదకెవరేని వానికి సరియైన మార్గము చూపకపోరు.

507. భక్తి చంద్రుడు, జ్ఞానము సూర్యుడు, యనదగును. ఉత్తరపు కొనయందును, దక్షిణపు కొనయందును సముద్రములు కలవని చెప్పగా వింటిని. అచ్చట మిగుల శీతలముగ నుండును; సముద్రములు కొంతకొంతగా గడ్డకట్టిపోయి పెద్ద