పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

170

శము లభించును; భక్తికో భగవంతుని అంతఃపురమును జొచ్చు వసతి యబ్బగలదు.

503. భగవద్భక్తిసాగరమున లోతుగ మునుంగుము. భీతి వలదు, అయ్యది అమృతసాగరముసుమీ! నేను నరేంద్రునితోడ ఒకప్పుడిట్లుపలికితిని:- "భగబంతుడుమధురసాగరము. ఆసముద్రమున లోతుగనీవు మునుగకోరుకొనవా? వెడల్పు మూతిగల పాత్రలోచక్కెరపానకము పోసిరనుకొనుము. దానిని త్రాగవాంఛించుఈగవు, నీవు అనుకొనుము.

నీవు ఎక్కడవ్రాలి దానిని త్రాగెదవు?

తాను దానిఅంచుననుండి త్రాగుదుననియు, లేక తాను దానిలోపడుట తటస్థించినయెడల దానిలోనేమునిగి చావవలసి వచ్చుననియు, నరేంద్రుడు బదులుపలికినాడు. అంతట నేనిట్లు చెప్పితిని.

"అబ్బీ! నీవు ఆదివ్యసాగరమున లోతుగచొచ్చునప్పుడు అపాయముకల్గుననిగాని చావుమూడుననిగాని భయపడనవసరములేదనుటను మఱచినావు. ఆసచ్చిదానందసాగరము అమృతసముద్రము; నిత్యజీవనముతో నిండియుండునది; నెడగుమానసులవలె; నీవు భగవదనురాగమున "హద్దుమీరి పోదునేమో! యని భయపడకుము."

504. ప్రేమ కొలదిమందికి మాత్రమేలభ్యముకాగలదు. వారసాధారణప్రజ్ఞావంతులుగనుండి, భగవదావేశ కలితులై యుందురు. అట్టివారు భగవన్మ హిమలకును అధికారములకును వారసులైప్రత్యేక వర్గముగ నేర్పడియుందురు. చైతన్య