పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25వ అధ్యాయము.

భక్తి లేక ఈశ్వరానురక్తి

496. అనురక్తియొక్క పూర్ణసిద్ధావస్థ లేక పరాభక్తి అనగా ఎట్టిది?

అనురాగసిద్ధావస్థయందు, అర్చకుడు భగవంతుని గూర్చి తనప్రియతమునిగానో, అత్యంతసన్నిహిత బంధువునిగనో, మననముచేయును. అదిగోపికలు శ్రీకృష్ణునియెడ చూపిన అనురాగమును బోలియుండును. వానిని వారుజగన్నాధునిగగాక సదాగోపీనాధునిగనే పాటించి అటులనే పిలుచుచువచ్చిరి.

497. నున్ననిఅద్దముపైని దేనినిగాని ముద్రింపవీలులేదు. దానికితగిన లేపనముల రాసినపిమ్మట రూపగ్రాహి (పోటో) యందువలె, చిత్రరూపములనుదానిపైని ముద్రింపవీలగును. అటులనే నరునిహృదయమునకు భక్తియనురసాయనిక లేపన మను కల్పించినయెడల భగవంతుని ఆకృతినే అందుస్థిరముగ ముద్రింప వసతిగల్గును.

498. చెఱువులోని చేపలు ఎంతదూరముగ నున్నను మధురమై నోరూరించగల ఎఱను నీట జల్లినయెడల అవి తక్షణమే నలుదిశలనుండి పర్విడివచ్చును. అదేతీరున, భక్తునిహృదయమున భక్తి విశ్వాసము అను ఎఱను వెదజల్లినచో చచ్చఱ భగవంతుడు యచ్చటికివచ్చిచేరును.