పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

152

449. నీ "అహం" భావమురూపుమాసి నీవు పరమాత్మయందు లయముగాంచునప్పుడు ముక్తిలభించును.

450. జీవుని నిజస్వభావము నిత్యసచ్చిదానందము. "అహం" కారమువలన పెక్కుఉపాధులుకలుగగా, అతడు తననిజస్వభావమును మఱచుచున్నాడు.

451. అందఱి దంభములును క్రమక్రమముగ సమసిపోగలవు. కాని జ్ఞానికి వానిజ్ఞానము గూర్చిన ఆడంబరము వీడుట దుర్లభము సుమీ!

452. "జగజననీ! నేను ఘనుడను, నేను బ్రాహ్మణుడను వారు క్షుద్రులు, మాలవారు అను భావములన్నింటిని నశింపజేయుము. ఏలయనవారలెవరు?, నీయనంత రూపాంతరములు గాక!"

453. "తల్లీ! నేను యంత్రమను; నీవు యంత్రివి. నేను గృహమును; నీవందుండుదానవు. నేను కత్తియొరను. నీవు కత్తివి. నేను రధమును; నీవు రధికవు. నీవు నాచేత ఎట్లు చేయించిన, నేను అటుల చేయుదును. నీవు మాట్లాడించిన తీరున నేను మాట్లాడుదును. నీవు నాలోనుండి వర్తించు రీతిని నేను వర్తింతును. "నాహం నాహం" (నేనుకాదు, నేనుకాదు.) "త్వమసి" (అంతయు నీవే)"

454. రెండు తెఱగుల 'అహం' కారము కలదు; ఒకటి పక్వమయినది, రెండవది అపక్వమైనది. "నాదేమియులేదు, నేనేమి చూచినను, అనుభవించినను, వినినను, ఇంతేల నాశరీరము సయితము - నాది కాదు. నేను సదా నిత్యముక్త బుద్ధ