పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

1 వ అధ్యాయము.

13. స్వభావముచేతను అంతరభేదముచేతను జ్ఞానము భిన్నభిన్నముగ నుండును. సామాన్యప్రజలగు సంసారుల జ్ఞానము ఒకటి. ఇది అంతగా తీక్ష్ణమైనదిగాదు. దీనిని గదిలోపల నుంచబడిన దీపమునకు పోల్చవచ్చును. దీనిప్రకాశము గదిలోపల మాత్రమేయుండును. ఇంతకంటె ప్రకాశవంతమగు భక్తుని జ్ఞానమును వెన్నెలకు పోల్చవచ్చును. దీని వలన గదిలోని వస్తువులును వెలుపలివస్తువులును ప్రకాశింప గలవు. అవతారపురుషుని జ్ఞానమో ఇంకను తీక్ష్ణతరమై, సూర్యరశ్మికి పోల్చదగియుండును. అట్టివాడు యుగ యుగములనుండి పేరుకొనియున్న అజ్ఞానాంధకారమును క్షణములో రూపుమాపుదివ్యజ్ఞానమనెడు కాంతిని ప్రసరింపజేయునట్టి సూర్యభగవానుడే అనవలయును.

14. ఎవనికేని ముల్లు గ్రుచ్చుకొనినప్పుడు, అత డింకొక ముల్లుతెచ్చి, దానితో మొదటిముల్లును పైకితీసి, రెంటిని పాఱవేయును. అటులనే జీవుని నేత్రమును కప్పివేయు లౌకికాజ్ఞానముతోడనే తొలగించవలయును . అట్టి అజ్ఞానమును , జ్ఞానముగూడఅవిద్యామయములే సుడీ! కావున బ్రహ్మజ్ఞాని తాను ద్వైతభావ రహితుడగుటచేత, ఆఅజ్ఞానమును, జ్ఞానమును సయితము త్యజించివేయును.

15. జ్ఞానమును గూర్చిన అత్యుత్తమ భావనయేమి ? - జ్ఞాని యిట్లనును; "భగవంతుడా ! ఈజగత్తున నీవొక్కడవే కర్తవు. నేను నీచేతిలోని స్వల్పఉపకరణమాత్రమను. మఱియు నాదేదియు లేదు. సర్వమును నీయదియే. నేను