పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

150

ఆపశువు "అహం"కారమును వీడదు దాని చర్మముతో డోలు కప్పినప్పుడు "హం" (నేను) అను ధ్వని చేయును. దాని ప్రేవులను పెఱికి చీల్చి దూదేకులవాని నారిగాపెనవేసినప్పుడుగాని ఆపశువు వినయమునేర్చుకొనదు; అప్పుడీపశువు ప్రేవులు "తుహై" (నీవు) అను గానముజేయును. "అహం" (నేను) తొలగి "తు" (నీవు అనుభావము రావలయును. ఆత్మజ్ఞానముకలిగినగాని నరునకు ఈదశప్రాప్తముకాదు.

444. ప్రశ్న:- "అహం" కారము పూర్తిగ ఎన్నడును నశింపదా?

జవాబు:- కాలపరిపాకమున కలువరేకులు రాలిపోవును. కాని వానిమచ్చలు నిలిచియుండును. అటులనే నరుని "అహం"కారము పూర్తిగ వదలిపోగలదు; కాని పూర్వస్థితియొక్క చిహ్నములు నిలిచియుండును. అయినను అయ్యవి దుష్కర్మప్రేరకములు ఎంతమాత్రమునుకావు.

445. నీనీ "అహం"కారమును పోనడంచజాలనటుల కాన్పించినయడల, దాని "దాసోహం" భావముగ నిలిచియుండనిమ్ము. "నేను భగవంతుని కింకరుడను; నేను వాని భక్తుడను" అనుకొనునట్టి అహం" భావమువలన అంతగా కీడుకలుగదు. మిఠాయీలు అజీర్ణవాతమునకు కారణములగును; కాని కలకండ అట్టిదికాదు; దానియందంతటి దుర్గ్ణములు లేవు.