పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149

22వ అధ్యాయము.

నీయదియే; నాదికాదు. నీయాజ్ఞానుసారమే సేవయొనర్చుటకుమాత్రము నాకుహక్కుగలదు." అనిపలుకును.

442. ఇనుము పరశువేదిని (Philospher's stone) తాకి బంగారముగా మారనంతవఱకు, నీచలోహముగనే యుండుతీరున, జీవునకు ఈశ్వరసాక్షాత్కారము కానంతవఱకు "నేను కర్తను" అను భ్రమతొలంగదు. అంతవఱకును "నేనుఈసత్కార్యముచేసితిని ఆదుష్కర్మనుచేసితిని" అనుభిన్నభావము తప్పక వెన్నంటియేయుండును. ఈభిన్నభావమే, యీద్వైతిభావమే నిరంతరముగ సాగివచ్చుచున్న సంసారమునకు మూలమగు మాయ. ఉచితమార్గముననడుపుసత్వగుణప్రధానమై పఱగునది విద్యామాయ. దీనినిశరణుజొచ్చుదుమేని భగవంతునిచేర గల్గుదుము. ఇట్లు భగవంతుని ముఖాముఖినిచూచి వానిని ప్రసన్నుని చేసికొనినవాడు మాత్రమే మాయాసంసారమును దాటగల్గుచున్నాడు. భగవంతుడే కర్త యనియు, తాను అకర్తననియు గ్రహించునతడు ఈశరీరముండగనే ముక్తుడు కాగల్గుచున్నాడు. (అనగా జీవన్ముక్తుడగుచున్నాడు.)

443. అహంభావము చాల చెడ్డది. అది నిర్మూలము కానిది ముక్తిచేకూరదు. లేగదూడనుచూడుము. అది పుట్టుటతోడనే "హంహై" (నేనున్నాను) అని యఱచును. అందు ఫలితార్ధమేమి? అది పెద్దదైఎద్దగును. అప్పుడు దానిని నాగలికి కట్టుదురు. బరువులతో నింపిన బండ్లనది లాగవలసి యుండును. ఆ వైనచో గుంజలకు కట్టివేతురు; ఒక్కొక్కప్పుడు చంపియుయుగూడ తిందురు. కానియింతగా దండనల పాలైనను,