పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

148

437. క్షుద్రాహంకారముతో ఎంతయో తీవ్రంపు పోరాటముసలిపి, ఆత్మజ్ఞానముకొఱకై భల్లూకపు పట్టుపట్టి ప్రయత్నించి, సమాధిదశను సాధించగల్గినప్పుడు మాత్రము ఈ "అహ"మును దాని పరివారమును తొలగిపోగలవు. అహంభావముచాలమొండిది. దాని మూలముననే మనము తిరిగి తిరిగి యీలోకమున జన్మయెత్తుచుండుట!

438. "నేను భగవంతుని సేవకుడను" అను భక్తుని అహంభావము, విద్యాహంకారమనబడును. దానిని సిద్ధాహంకార మందురు.

439. ప్రశ్న:- "నీచాహంకారమ"నగా ఎటువంటిది.

జవాబు:- "ఏమిటి! వారునన్నెఱుగరా? నేనింత ధనికుడనే? నాయంతటిభాగ్యవంతు డింకెవడుగలడు? నన్నుమించి పోజాలువాడెవడు? అని ప్రలాపించు "అహంకారము" నీచాహంకారము.

440. తమస్సుయొక్క స్వభావమే అహంభావము. అజ్ఞానమువలననే అదిపుట్టి ప్రబలమగుచున్నది.

441. ప్రశ్న:- నేనుముక్తుడనగుట ఎప్పుడు?

జవాబు:- "నేను" అను మాటనీనుండి తొలగినప్పుడు! "నేను", "నాది" అనుట అజ్ఞానము; "నీవు, నీది" అనుట సుజ్ఞానము, నిజమగుభక్తుడు "దేవా! నీవేకర్తవు, సకలమును చేయునది నీవు. నేనునీచేతులలో ఉపకరణమాత్రమను. నీవు నాచేత ఏమిచేయించిన, నేనుదానిని చేయుచున్నాను. ఈసమస్తమును నీవిభూతియే. ఈయిల్లు, ఈసంసారము సర్వమును