పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

147

22వ అధ్యాయము.

గాని వేఱొకటి కాదనియు, అట్టివారు మఱచుచున్నారు. బుద్ధిమంతుడు "భగవాన్! అంతయు నీవే; సర్వమును నీవే" అనును పామరులునుభ్రాంతిపరులును "నేను, నేను" అనిప్రలాపింతురు.

433. నీవు ఎంతకాలము "నేనెఱుగుదును" అనిగాని "నేనెఱుగను" అనిగాని పలుకుచుందువో యంతకాలమును నీవొక వ్యక్తిగ భావించుకొనుచునే యుందువు. నీలోని అహమును నేనుతొలగించువఱకును, సమాధిని ప్రాపించి అవ్యయాఖండబ్రహ్మమును కనుగొనజాలవు సుమీ!" అని నాజగజ్జనని పలుకుచున్నది. అంతవఱకును ఈ "నేను" అనునది నా యెదుట నిలిచియే యుండును.

434. వెల్లుల్లిరసము పోసినగిన్నెను వేయుసార్లు తుడిచినను ఆవాసనపోదు అహంభావమనునది యంతటి మొండిభావము. ఎంతటి మహాప్రయత్నములు చేసినను అది పూర్తిగ మనలను విడిచి పోదు.

435. ప్రశ్న:- నరునికి మోక్షము లభించుటెన్నడు?

జవాబు:- వాని అహంభావము నశించినప్పుడే!

436. సమాధిని సాధించి అహంభావమును తొలగించుకొన గల్గువారు చాలఅరుదు. సాధారణముగా యదివిడువనే విడువదు. విసుగు విరామములేకుండ తర్కించినను వివేకించినను ఈ అహం అనునది మరలవచ్చి పై బడుచునే యుండును. రావిచెట్టును యీనాడు నఱికితిమిగదా అనుకొనిన రేపు చిగుర్చునే చిగుర్చును.