పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22వ అధ్యాయము.

అహంభావము

429. అహంభావము నిలిచియుండునంతకాలము ఆత్మజ్ఞానముగాని, ముక్తిగాని సంభవముకాదు. జననమరణబంధము తొలగదు.

430. నేనుఈగుడ్డను నాముందుతెఱగా పట్టుకొనినయెడల ఎప్పటివలె నేనుమీకు దాపుగనేయున్నను మీరునన్ను చూడజాలరు. అటులనే అహంభావమను తెఱవలన భగవంతుడు మీకుసర్వముకంటెను దాపుగనున్నను మీరువానిని చూడజాలకున్నారు.

431. ప్రశ్న:- స్వామీ మాకీఅవరోధమేల ఏర్పడినది? మేముదైవమును చూడజాలకుండుటేల?

జవాబు:- అహంభావమనునది జీవునియొక్కమాయ. ఈ అహంభావమే ప్రకాశమునుఅడ్డుచున్నది. ఈ 'అహం నేను: అనునదినశించెనాచిక్కులేదు. భగవదనుగ్రహమువలన 'నేనుకర్తనుగాను; ఆకర్తను' యనుభావము హృదయమున నెలకొనెనా ఈ జన్మయుండగనే నరుడు ముక్తుడగును. అతని కింక యేలాటిభయమును యుండదు.

432. పేరుప్రతిష్థలకై దేవులాడువారు భ్రాంతిలో పడినవారు. సర్వమునకును నియామకుడగు ఈశ్వరుడే అన్నిటిని నడిపించుచున్నాడనియు, సకలమునకును కారణము ఈశ్వరుడే