పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

145

21వ అధ్యాయము.

డవే అగుదువు. సంజచీకటులు క్రమ్మగానె మెరుగుడుపురుగులుకాన్పించి తాముప్రపంచమునకు వెలుగునిచ్చుచున్నట్లు గర్వించును. కాని నక్షత్రములు తళతళ మెరయుట ప్రారంభముకాగానే వానిగర్వము అడంగును. అప్పుడు నక్షత్రములు "మేముజగమునకు ప్రకాశమునిచ్చుచున్నాము." అని ప్రగల్భములుసాగించును. చంద్రోదయముకాగా యవి వెలవెలపోవుచున్నవి. ఆచంద్రుడో తాను విశ్వమునంతను వెలుగుతో నింపి మనోహరసుందరమూర్తినై పఱగుచుంటినని ఆత్మలో పొంగుచుండును. ఇంతలో అరుణోదయమై తూర్పుదిశను సూర్యభగవానుడు యుదయించనున్నడనిచాటును. అప్పుడు చంద్రుని ప్రభావమెక్కడ?

ధనికులని విఱ్ఱవీగువారు ఈప్రకృతి సంఘటనల తలపోసి తమ భాగ్యభోగ్యములగూర్చి మిట్టిపడకుంద్రుగాక.

428. కామినీ, కాంచనముల మోహము మనస్సునుండి తొలగిన యనంతరము జీవునికి మిగులునదేమిటి? అప్పుడు బ్రహ్మానందము ప్రశాంతముగ పఱగ గలదు.