పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

140

413. కామినీ కాంచన ప్రేమయందు మునిగిన మనస్సు లేత పోకకాయవలె నుండును. అది పచ్చిగానుండునంతకాలమును పై బెరడునకు అంటుకొనియే యుండును. అది పండి యెండినప్పుడు వక్కయు, డొల్లయు వేఱుపడి, కదలించునప్పుడు లోపలికురిడి లొటలొటలాడును. అటులనే లోనున్న కామినీ కాంచన మోహము ఎండబారినప్పుడు, జీవునకును శరీరమునకును ఎంతమాత్రమును సంబంధము లేదనుట తెలియవచ్చును.

414. త్రాసుయొక్కముల్లు నిటారుగనిలువకుండ ఎప్పుడు ఒరగిపోవును? ఒకవైపుశిబ్బె రెండవదానికన్న బరువైనప్పుడే గదా? అటులనే మనస్సున కామినీకాంచనములంగూర్చిన ప్రేమభారముపడినప్పుడు, అదిభగవంతుని చూచుటతప్పి ఒరగిపోవును.

415. సంసారులారా! స్త్రీలపైమిక్కుటముగ ఆధారపడి యుండబోకుడు. కానరాకుండవారు మీపైని తమఅధికారమును స్థాపించుకొందురు సుడీ!

416. క్రోతి వేటగానికాళ్లకడపడి చచ్చుచందమున పురుషుడు సుందరాంగి చరణములకడ బలియగుచున్నాడు.

417. శ్రీరామకృష్ణ పరమహంసులవారికి ఏలాటికర్చులు అవసరమైనను డబ్బుసిద్ధముగచేతనుండు నటుల కొన్నివేలరూపాయలను అర్పణచేయుటకు అనుజ్ఞనీయుడని యొకమార్వాడీ వర్తకుడు వేడుకొనెను. కాని శ్రీపర