పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

138

ఇందుకు సమాధానముగా "స్త్రీల సాంగత్యముననున్నారు గాన వారుఉత్తమబోధలను మనసున నిలుపుకొనజాలకున్నారు. కావున నిత్యానందసోదరా! ఈలౌకికజనులకు పాపము! ముక్తి యలవడుట దుర్లభము" అని శ్రీచైతన్యులవారు పలకిరి.

405. ఈసర్వమును దిగమ్రింగుదానిని "మాయ" యనవలయునా 'మాయి' అనవలయునా?

406. కామినీకాంచనములందు తగులువడిన నరులు వాని మూలమున వేనవేలుగ అవమానములు పొందుచున్నను, వాని బంధములనుండి విడివడి, మనస్సును మాధవునిపైకి ద్రిప్పజాలకున్నారు.

407. తీవ్రవైరాగ్యముపూని యొక్కసారి బ్రహ్మసాక్షాత్కారమును పడసినయెడల, అతిబలతరములగు మోహబంధములు తెగిపోయి, భార్యదాపున నున్నను వానికి అపాయము వాటిల్లదు. ఒక యినుపముక్కకు సమదూరమున రెండువైపులను సూదంటురాళ్ళున్నయెడల, వానిలో యేది దానిని లాగివేయును? ఆసూదంటురాళ్ళలో పెద్దదనుటకు సందియములేదు. శ్రీహరి పెద్దసూదంటురాయి అనుటకు సంశయములేదు. అప్పుడు చిన్నసూదంటురాయివంటి స్త్రీ నరునేమిచేయగలదు?

408. నీవెంత జాగరూకతతో మెలగువాడవైనను,నిండుగ పొగచూరి మసిపట్టియున్నగదిలో వాసము చేసితివా, యింతయో అంతయో మసిడాగుపడక తప్పించుకోలేవు. ఎం