పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

135

20వ అధ్యాయము.

అట్లగుచున్నది. కామాదులను తృప్తిపఱచుకొనుటచేత కలుగు అల్పసుఖములకంటె యెన్నియోకోట్లరెట్లు సుఖప్రదమగు బ్రహ్మానందమునకు చేరువనే జీవుడున్నాడు. కాని ఆ బ్రహ్మానందమును యనుభవించుటకు మారుగా ప్రాపంచిక విషయ సుఖముల వాసనచేత లాగబడి మాహామాయపన్నిన వలలో జిక్కుకొని, భ్రాంతుడై యందేమరణించుచున్నాడు.