పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

131

19వ అధ్యాయము.

385. నీవు సజీవుడవై యున్నంతకాలమును, భక్తిధ్యానముల రహస్యములను గూర్చి యనుదినమును విచారణచేయుచునే యుండుము. అందువలన నీకు లాభముకలదు.

386. ప్రశ్న:- ఎప్పుడో అరుదుగా గాని హృదయమున శాంతి పొడమదు. అట్టిశాంతి దీర్ఘకాలము నిలువకుంటకు హేతువేమి?

జవాబు:- వెదురుకట్టెలు కాల్చిచేసిననిప్పు చల్లారకుండ నిలుపుటకు తఱచుగా కదల్చుచు ఊదుచునుండవలెను. అటులనే ఆధ్యాత్మికాగ్నిని నిరంతరము జ్వలింపజేయు ప్రయత్నము సాగించుచునే యుండవలయును.

387. ముంగురులు చుట్టుకొనిపోవుసిద్దీ (Negro) జుట్టును పోలియుండుమనస్సు నీవెంతగా సవరించి దాని కుటిలతను (వంకరగతిని) మాన్పజూచినను అది పెడత్రోవల బోవుచునే యుండును. మనస్సును తిన్నగ లాగిపట్టి గట్టిగ నిలిపియుంచునంత కాలము యది సరిగనే నడచును. ప్రయోజనకారిగనే యుండును; కాని జాగ్రత్తకొఱవడెనా యది వక్రగతికి తిరుగును.

388. క్రొత్తకుండను నిండుగానింపి ఉట్టిమీద బెట్టియుంచుము. నాల్గుదినాలలో నీరంతయుపోయి తడియు ఆరిపోయి పొడిగనుండును. కాని దానినే నీటిలోనుంచితివేని అదటుల నున్నంతకాలమును నిండుగనే యుండును. భగవద్భక్తి విషయమున నీగతియు యిటులనేయుండును. అదేతీరున నీ హృదయమును భగవద్భక్తితోడనింపి, కొంతవడికి దైవమునుండి