పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

130

382. పండ్రెండువత్సరములు అనావృష్టివచ్చి యేమియు పండకపోయినను వంశపరంపరగా వ్యవసాయముచేయుచుండిన రైతు సేద్యమునుమానడు. కాని క్రొత్తగావ్యవసాయమునకు దిగినకోమటి ఒక్కఋతువులో వానలులేక బెట్టగా నుండుట తటస్థించినయెడల దిగులుపడి ఆవ్యవసాయమును కట్టిపెట్టును. అదెతీరున సహజమగుభక్తిగలవాడు ఒకజన్మకాలమంతయు తనభక్తిఫలించి దేవతప్రత్యక్షము కాకపోయినను నిరుత్సాహమును చెందడు. (క్రొత్తగాభక్తిచేయ మొదలిడు నతడు సద్యోఫలములేదని మానివేయును.)

383. పతివ్రతయగు స్త్రీ తాను ప్రేమించిన భర్తమరణించిన యనంతరమును తన పాతివ్రత్యమును వీడక తనభర్తను భావమున పూజించుచునేయుండును. అటులనే అనన్య భక్తిగలనరుడు తన యిష్టదైవతమును నిశ్చలముగ అంటిపట్టుకొనియుండి వానితో సైక్యతను సాధించును.

384. ఇత్తడిచెంబు అనుదినము తోమనియెడల చిలుముపట్టి కగ్గిపోవును. అటులనే ప్రతిదినమును ధ్యానాదులుచేయక విడచినయెడల నరుని హృదయము మలినమగును" అని శ్రీపరమహంసుల వారిగురువుశ్రీతోతావురిసెలవిచ్చెను. ఆచెంబు స్వర్ణమయమైనదైనయెడల దానిని ప్రతిదినము తోముట అనవసరము. అటులనే బ్రహ్మసాన్నిధ్యమును పడసిన నరుడు పూజలు పునశ్చరణలు చేయకున్నను లోటుకలుగదు. అని శ్రీపరమహంసులవారనిరి.