పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

126

ములు మునుముందు ప్రీతికరములుగనుండి, తుదినితెచ్చిపెట్టు దుఃఖములు భరింపరాకుండును; ఊహింపజాలము ఆబాధ.

372. ముండ్లతోడనుపొదలతోడనునిండియున్న యడవిలో చెప్పులు లేకుండ నడచుట దుస్సాధ్యము. ఎవడేని యందులోనికి పోవలయుననిన అడవినంతను తోళ్ళతో కప్పివేయవలయును. లేదా తనకాళ్ళకు చెప్పులు తొడగవలసియుండును. అడవియంతటను తోళ్ళుపఱచుట అసంభవము గదా. కావున తనకాళ్ళకే చెప్పులు తొడుగుకొనుటలెస్స. అదేతీరున ఈ ప్రపంచములో లోభము దారిద్ర్యము యనునవి అంతులేని బాధల గల్పించుచున్నవి. వానినుండి తప్పించుకొనుటకు రెండుతెఱగులే కలవు; సర్వసంపదలను పూర్ణముగ త్యజించుట యొకటి; వానిని పూర్ణముగ చేకూర్చుకొనుట మఱియొకటి; అన్నివాంఛలను తీర్చుకొని తృప్తినిబడయుట అసంభవము. ఏలయన ఒకకోరిక సఫలమైన వెనువెంటనే మఱొకటి తలజూపుచునే యుండును. కాబట్టి సంతుష్టిని, సత్యజ్ఞానమును, సంపాదించికోర్కెలనడంచివేయుట దొడ్డబుద్ధిసుమీ!