పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

125

18వ అధ్యాయము.

368. కామములనెడు పెనుగాడ్పులువీచగా హృదయాంతరాళమున గందఱగోళముసాగుపట్ల మనము పరమేశ్వరుని నిర్మల కాంతులను చూడజాలము. నిశ్చలముగనుండి భగవత్సాన్నిధ్య సుఖమును హృదయమున పొందజాలునప్పుడే ఆదివ్య దర్శనము లభించగల్గును.

369. తైలముతో తడసియున్న కాగితము పైన ఏమియు వ్రాయలేము. అటులనేపాపచింతనము లోలతయను నూనెతో పాడైపోయిన హృదయము భక్తి సాధనకు పనికిరాదు. కాని నూనెకాగితముమీద సున్నము పూసినయెడల వ్రాతకు అనుకూలించును. అదేరీతిగా ఈహృదయమునకు వైరాగ్య మనెడు సున్నమును పూసినయెడల అదితిరిగి ఆధ్యాత్మసాధనకు పనికివచ్చును.

370. విషపు సాలెపురుగొకటికలదు. అదికొఱికినయెడల, పుండును పసుపువేళ్లుతెచ్చి వానితోముందుగానిమిరి మంత్రములుపెట్టిననేతప్ప ఏఔషధముచేతను దాని విషము విరుగదు. అలాపుండును సంస్కరించిన వెనుక యితరములగు మందులు పనిచేయును. ఆవిధముగానే లోభ మోహములనెడు సాలెపురుగులు నరునికొరికినయెడల, ఆతడుపారమార్ధిక సాధనల సాగించగల్గుటకు పూర్వము, వైరాగ్యమంత్రముచే సంస్కారమును పొందక తీరదు.

371. తామరలేచినచోట గోకుకొనునప్పుడు హాయిగ నున్నట్లే కనుపించును; కాని తదనంతరము కలుగు మంటలు బాధలు మిక్కుటముగ నుండును. అట్లే యింద్రియభోగ