పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

124

పాలు చేపలుతప్ప మఱేమియు తినకున్నది." అని మొఱలిడుచుండును.

364. ప్రశ్న:- వైరాగ్యము ఎన్నివిధములుండును?

జవాబు:- సామాన్యముగ అది రెండురీతులనుండును -

తీవ్రవైరాగ్యము, మందవైరాగ్యము. ఒక్క రాత్రిలో చెఱువుత్రవ్వి నిండుగానీరునింపవలయునని పట్టుపూనుటవంటిది తీవ్రవైరాగ్యము, నెమ్మదిగా అడుగడుగునకు ఆగుచునడచునది మందవైరాగ్యము. ఇదిఎన్నడు పక్వదశకువచ్చునో చెప్పవీలులేదు.

365. ఒకడు స్నానమునకై ఏటికిపోవుచు మార్గములో యెవరో ఒక పెద్ద మనిషిచాలాదినములుగా సన్యాసియగుటకు ఆలోచనలు చేయుచున్నటుల వినెను. ఎట్లోఈమాటవలన సన్యాసము పరమోత్తమము యనుబుద్ధి వానికితట్టినది. వెంటనేయతడు సన్యాసముపూని కేవలము కట్టుకొనియున్న అంగవస్త్రముతోడనేవెడిలిపోయినాడు; తిరిగియింటిచక్కి రాలేదు. తీవ్రవైరాగ్యమనగా యిట్లుండును.

366. భగవదనుగ్రహమువలన ఒకనికి తీవ్రవైరాగ్యము లభించెనేని, అతడు కామినీకాంచనముల బంధనమునుండి తప్పించుకొనగలడు. అప్పుడుమాత్రమే వానికి సంసారబంధములు బాయగలవు.

367. గదితలుపు తాళముతీయవలయునంటే తాళపు చెవి వెనుకకు తిరుగవలసియుండును. భగవంతుని ప్రాపించ దలచువాడు సంసారమును సర్వమును విడువవలసియుండును.