పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18వ అధ్యాయము.

వైరాగ్యము - లేక నిష్కామ్యత.

360. నిత్యానిత్య విచారముచేసి, నిష్కామియైననేతప్ప, వేదములన్నియు పఠించినను, అపారముగ శాస్త్రములు చదివినను, నిష్ఫలమే. వివేకము, వైరాగ్యములేనిది ఆధ్యాత్మికయాత్ర సాగదు.

361. బెదురుగుఱ్ఱమునకు కండ్లగంతలుకట్టిననేతప్ప తిన్నగ నడవజాలదు. అటులనే గృహస్థుని మనస్సునకు వివేక వైరాగ్యము లనెడు గంతలులేని యడల చిందులుత్రొక్కి పెడదారుల పోవును. తిన్ననిత్రోవను నడవదు.

362. ప్రశ్న:- పరమాత్ముని చేరుటెట్లు?

జవాబు:- వానిని దర్శించగోరితివేని, నీతనువును, మనస్సును, సంపదను త్యజించవలసి యుండును.

363. భగవంతుని పాదారవిందములకడ శరణుజొచ్చుట సులభమగునా?

జవాబు:- మహామాయ నిన్నటుల చేయనీయదు. తన ప్రాపుకోరువారు లేకున్నను నరుడు ఒక పిల్లినైన పెంచి సంసారమును కల్పించుకొని బంధనమేర్పఱచుకొనుచున్నాడు. ఆపిల్లికొఱకు పాలు కావలెనని, చేపలుకావలెనని దేవులాడుచు తిప్పలుపడుచుండును. "నేనేమిచేసేది? ఈపిల్లి