పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

117

16వ అధ్యాయము.

343. తల్లితనబిడ్డలలో ఎవరికితగిన ఆహారము వారికి లభించుకొఱకు వంటకములను వేర్వేఱురీతులుగా చేయును. ఆమెకు అయిదుగురు బిడ్డలుండి ఒక పెద్దచేపదొఱికినయడల దానిని వేర్వేఱురీతులుగ పచనముచేసి యెవరికి యేదిసరిపడునో వారికదిపెట్టును. ఒకనికిపల్వాచేసి పెట్టును; జీర్ణశక్తికొఱవడిన మఱొకనికి చారుగాచిపెట్టును. తక్కినవారికి కూడ వానివానికడుపునకు సరిపడుతీరున వండిపెట్టును.

344. ఒకశిష్యుడు:- బ్రహ్మము సాకారుడు అని నమ్మనేవచ్చును. కాని అతడు, మనముపూజించు మట్టిబొమ్మమాత్రము కాజాలడు.

గురువు:- దానినిమట్టిబొమ్మఅనెదవు ఏల? ఆదేవతావిగ్రహము ఆత్మమయముగా చేయబడినది.

345. విగ్రహారాధనమున ఏమేని కొఱతయున్నను, అర్చనలు సర్వమును తనకొఱకే ఉద్దేశింపబడినవని భగవంతునికి తెలియదా? అర్చనలు తనకై యే ఉద్దేశింపబడినవని గ్రహించి వానిని భగవంతుడు స్వీకరించును. భగవంతుడు ప్రేమమయుడు. అత్యంత సమీపముగనున్న నీధర్మమును నీవునిర్వహింపుచుండుము.

346. ఒకనికి బ్రహ్మసాక్షాత్కారమైనప్పుడు ప్రతివస్తువును, విగ్రహములు సయితమన్నియు, ఆత్మస్వరూపములేయనితెలిసికొనును. అటువంటివాని దృష్టిలోవిగ్రహము ఆత్మమయరూపమేగాని కేవలము మృణ్మయముకాదు.