పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

116

సాధనచేసి, తదనంతరము నిరాకారబ్రహ్మముపైని సులభముగ చిత్తమును నిలుపుజాలును.

340. పెద్దపెద్ద వస్తువులపై అమ్ములవేయుటచేత విలుకాడు బాణప్రయోగమును నేర్చును. బాణప్రయోగమున వానికి నేర్పరితనము కుదిరినకొలది సూక్ష్మతర లక్ష్యములపై గురిని నిలుపసాగును. అటులనే సాకారములగు విగ్రహములపైని మనస్సును లగ్నముచేయుటసాధనచేసిన పిమ్మట, నిరాకారవస్తువుపైని మనస్సులగ్నముచేయుట సులభముగ చేకూరును.

341. ఆవుపాలు నిజముగా రక్తరూపమున ఆవుశరీరము నందంతటను వ్యాపించియుండును. అయినను ఆఆవు చెవులను కొమ్ములను పిండుటచేపాలురావు. పొదుగునుండియే పాలు పితుకవలెను. అటులనే భగవంతుడు జగమునంతటను నిండియున్నాడు. కానిఎల్లెడలను వానిని ప్రత్యక్షముచేసికొనజాలవు. ప్రాచీనభక్తవరులు పూర్ణభక్తితో సాధనములుచేసి యుండిన పుణ్యదేవళములందు భగవంతుడు సులభముగా ప్రత్యక్షముకాగలడు.

342. పరమహంసులవారు తనశిష్యులలో ఒకనికి యిట్లు చెప్పిరి:- నీవురేగడమట్టితో చేసినవిగ్రహముల గూర్చి వాకొనుచుంటివి. అవియు కావలసియే యున్నవి. ఆత్మపరివర్తనమున ఆయాదశలలోనున్న వారికి అనుకూలించుకొఱకు వేర్వేఱుఅర్చనారూపములు ఏర్పాటుచేయబడియున్నవి.