పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16వ అధ్యాయము.

విగ్రహారాథనము.

336. లక్కపండును, లక్కఏనుగును, నిజమగుపండును, ఏనుగును జ్ఞప్తికితెచ్చువిధమున, పూజింపబడు విగ్రహములు నిరాకారుడై నిత్యుడై వెలుంగు బ్రహ్మమును జ్ఞప్తికి తెచ్చును.

337. ఆకాలమున విగ్రహారాధనను ఖండించుచుండెడి కేశవచంద్రసేనునితో భగవాన్ శ్రీరామకృష్ణపరమహంసుల వారిట్లు పలికిరి:- "ఈ విగ్రహములు ఎందువలన నీమనస్సులో మన్ను, రేగడ, రాయి, గడ్డి అనుభావనలను కల్పింపవలె? ఈస్వరూపములందు సయితము అలనిత్యానంద విజ్ఞానమయి యగు జగజ్జననియే నీకేలప్రత్యక్షముకానాదు?"

338. తాను అర్చించు దేవులయొక్కయు, దేవియొక్కయు, విగ్రహములు నిజముగా దివ్యరూపములే అని విశ్వసించు నతడు బ్రహ్మమునేచేరును. కాని వానిని అతడు మన్ను, గడ్డి, రాయి, మాత్రమే అనితలచెనా, వానికీ విగ్రహములను ఆరాధించిన ఫలములేదు.

339. ఒక చిన్నఅక్షరములను వ్రాయుటకు పూర్వము పెద్దపెద్ద సున్నలను వ్రాయుట నేర్చువిధమున, విగ్రహముల మీద మనస్సునుస్థిరముగ నిలుపుటమూలమునచిత్తైకాగ్రతను