పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

110

దినమంతయు కష్టపడిపనిచేసి అలసియున్నవాడు దిండువేసుకొని పరుండి, తీరుబాటుగా చుట్ట త్రాగునప్పుడు అనుభవించు విశ్రాంతిసౌఖ్యము దాని లక్షణము. సమస్తములగు విచారములు ఆంధోళనములు విడిచిపోవును.

325. గాలిలో యిటుఅటు ఎగురు యెండుటాకులు తమ నిర్ణయము అనునదిలేక, ఏవిధమగు స్వకీయ ప్రయత్నములేక మెలగుచందమున, భగవంతునిపైన ఆధారపడువారు వాని యిచ్ఛానుసారము వర్తింతురు. తమ యిచ్ఛ అనునది యుండదు. తమ ప్రయత్నము అనునది యుండదు.

326. ఈప్రపంచములో వుండుటో, దీనిని విడిచి పోవుటో ఈశ్వరసంకల్పము ననుసరించి జరుగును. కావున సర్వమును ఆయనకు విడిచివేసి, నీవు పనిని మాత్రము చేయుచుండుము. నీవింతకన్న చేయగలదేమి?

327. క్రోతితిరుగులాడుచుండ, దానికూన దానిని గట్టిగ పట్టుకొనివ్రేలాడుచుండును. పిల్లికూన అటుల తల్లినిపట్టుకొనక జాలిపుట్టునటుల కూయును. తల్లియే దానినిమెడపట్టుకొని తీసికొనిపోవును. క్రోతిపిల్ల తల్లిఆధారమునువిడచెనా క్రిందపడిపోయి హానినందును. ఎందుచేతననగా అదితనబలమునే నమ్ముకొనుచున్నది. పిల్లిపిల్లకు అటువంటిభయములేదు. ఒకచోటనుండి మఱొకచోటునకు తల్లియేదానిని తీసుకొనిపోవును. స్వావలంబనమునకును, ఈశ్వరేచ్ఛకును అర్పణముచేసి కొనుటకును గల భేదము యిటువంటిదిగ నుండును.