పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

107

13వ అధ్యాయము.

నిప్పును అప్పుడప్పుడు యినుపకడ్డీతో కదల్చుచు చల్లారిపోకుండ బాగుగమండునటుల చేయుచుందురు. అటులనే సాధువుల సాహవాసముతో మనస్సునకు అప్పుడప్పుడు కదలిక చేకూర్చుచుండవలయును.

316. కమ్మరివాడు తన కొలిమిలోని నిప్పును తిత్తులతో ఊది ప్రజ్వరిల్లచేయుచుండును. సాధుసంగమువలన మనస్సును నిర్మలముగను ప్రకాశవంతముగను యుంచవలయును.

317. ఏనుగుశరీరమును శుభ్రముగ తోమి కడిగి, దాని యిష్టమువచ్చినటుల పోనిచ్చునెడల, త్వరలోనె అదితిరిగి ముఱికిచేసికొనును. కాని దానిని చావడిలోనికి దీసికొనిపోయి అక్కడ కట్టిపెట్టిన యెడల, శుభ్రముగ నుండును. అటులనే పుణ్యాత్ముల సత్ప్రేరణ వలన నీవు ఒకసారి సన్మార్గమునకు తిరిగినను, తదుపరి పామరజనముతోడ చేరినయెడల నీధార్మికత త్వరలోనె నష్టముకాగలదు. అటులగాక నీమనస్సును భగవంతునిపై స్థిరముగ నిలిపితివా, నీభావములు ఎన్నడును భ్రష్టములు కాజాలవు.

318. సాధుసంగము బియ్యపుకడుగు నీరువంటిది. కల్లుత్రాగినమైకమును హరించుశక్తి బియ్యపుకడుగునకు కలదు. అదేతీరున తుచ్ఛవాంచలనెడు కల్లునుత్రాగి కైపునపడియున్న పామరులను స్వస్థతపరచుశక్తి సాధుసంగమునకు కలదు.

319. జగజ్జననియగు ఉమాదేవి హిమవంతుని పుత్రికగా జననముకాంచినప్పుడు, ఆశక్తిమయిమాత తన అవతారరూపములను అనేకముచూపి వానిని ధన్యునిచేసినదని పురాణములు