పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105

12వ అధ్యాయము.

(5) మహాభావము:- భావముసాంద్రమైన యెడల మహాభావముఅనబడును. భక్తుడుఒకసారి పిచ్చివానివలె నవ్వును. ఇంకొకసారి ఏడ్చును. ఆతడు యింద్రియములను పూర్ణముగ జయించియుండును. శరీరస్ఫురణయే అతనికియుండదు. జీవునికి ఈదశ తరుచుగా అలవడునదికాదు. మహాపురుషులకు, ఈశ్వరావతారములకు మాత్రము ప్రాప్యమగుచుండును.

(6) ప్రేమ:- భగవంతునిపైని అత్యంతగాఢానురాగము. ఇయ్యది మహాభావముతోకూడి లభించుచుండును. ఈదశను సూచించు రెండు చిహ్నము లేవన:-

(1) ప్రపంచస్పృహ లేకపోవుట.

(2) తనశరీరమును, జీవాత్మనుకూడ మఱచుట. దీనివలన భక్తుడు దైవముతో ముఖాముఖిని (ఎదు రెదురుగా) నిల్చును అప్పుడు వానిజన్మ ధన్యమైనట్లే.