పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

103

12వ అధ్యాయము.

సాగించువారు గురువును, యిష్టదైవమును తోడుచేసికొని నడచువారు, మార్గమున అవరోధములను బాధలను గురించి, భయపడనవసరముండదు. వారి పురోగమనము సరళముగ సాగును. ఆతంకములు కలుగవు. వెనుకతిరుగుడులు తటస్థించవు.

306. సంసారపుయోచనలు, దిగుళ్లు నీమనస్సునకు తొందఱ కలుగజేయనీయకుము. ఏదియెప్పుడు అవసరమో యది అప్పుడు చేయుచుండుము. నీమనస్సునుమాత్రము భగవంతుని పైన స్థిరముగనుంచుము.

307. నీమనస్సున సంకల్పించినదానినే నీవు పలుకవలెను. నీభావములకును, నీమాటలకును సమరసత యుండవలెను. అటులగాక, దైవమేనీకు సర్వమును అని నోరుయూరక పలుకుచుండ, మనస్సుమాత్రము సంసారమేసర్వమునుయని భావించునెడల, నీకు అందువలన యిసుమంతయు లాభము కలుగబోదు.

308. భక్తునకు ప్రత్యేకవేషముండవలయునా? ప్రత్యేకవేషముమంచిదే. సన్యాసివలె కాషాయధారణచేసినప్పుడుగాని, హరిదాసువలె తాంబురను, తాళములనుచేబూనినప్పుడుగాని, సరసాలాపములు, బూతుమాటలు, జావళీలు, సాధారణముగా నోటరావు. కాని విటునివలెసోకుగ వేసమువేసినవాడు సామాన్యముగా నీచపుతలపులకులోనై బూతుపాటలను పాడవచ్చును.