పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

102

నల్లని అంచులుగలిగి సొబగుమీరు మజిలును ధోవతికట్టిన యెడల డంబముతోచును; శృంగారకీర్తనలనుకూడ పాడవచ్చును. సన్యాసుల కాషాయవస్త్రమువేసికొనుట, మనస్సునందు సహజముగా పవిత్రసంకల్పములను స్ఫురింపచేయును. కేవలము, వస్త్రధారణమువలననే ప్రత్యేకఫలము లభింపకున్నను, ఆయారకముల వస్త్రముతో అనుసంధించియుండు భావములు కలవు.

304. సూదిలోదారము గ్రుచ్చకోరుదువేని, విప్పారు పోగులను తొలగించి, దారమును కొనతేలునటుల పేనవలయును. అప్పుడుదారము సులభముగాసూదిబెజ్జములో దూర గలుగును. అటులనే నీవు నీమనస్సును, నీహృదయమును దైవముమీద ఏకాగ్రముగ నిలుపుగోరుదువేని, యిటునటు వ్యాపించు కోరికలను తొలగించి, వినయముపూని నమ్రుడవై దీనభావము వహించవలయును.

305. అష్టకాష్టముయను ఆటలో (పులిజూదపు ఆటవంటిది) పావులు అన్నిగదులను గడచి పోయిపోయి, తిరిగిరాకుండమధ్యగదిచేరి పండవలయును. ఆనడిమిగది చేరువఱకును, ఏపావైనను మరలమరల వెనుకకుపోయి, మొదటినుండి ప్రారంభించి ప్రాకులాడవలసినగతి తటస్థింపవచ్చును. కాని రెండుపావులుకూడి ప్రయాణము సాగించి, ఒక్కొక్క గదిని తోడుతోడుగ గడచుచు పోవునెడల, యింకొకరి పంటపావు చంపి వీనిని మొదటికి నెట్టివేయునను భయముండదు. అటులనే ఈప్రపంచములో ఆధ్యాత్మికసాధనను