పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

94

సూర్యుని ప్రతిఫలింపజేయువిధమున భగవంతుని చూడజాలుదురు. కావున పవిత్రుడవై యుండుము.

277. నేనుజీవుడను యనుకొనునరుడు జీవుడుగనే యుండును; నేనుశివుడను అనుకొనునతడు శివుడేయగును. ఎవడెటుల భావనచేసికొనునో అతడు యట్టివాడగును.

278. ఏమాత్రమైన కోరిక అను డాగు యున్నంతవరకును భగవంతుడు కానరాడు. కాబట్టి నీస్వల్పపుకోరికలను తీర్చుకొనుము. పెద్దకోరికలను వివేకముతో తర్కించి విడిచివేయుము.

279. ఎవడేని నిరంతరమును సత్యము పలుకువాడు కానియెడల, సత్యాస్వరూపుడగు భగవంతుని కనలేడు.

280. ఈజన్మయందేయెవడు మరణించియుండునో అనగా శవమునందువలె యెవనికామములును గుణములును మటుమాసియుండునో, యతడే నిజమైనపురుషవరుడు.

281. వేదములు, పురాణములు, చదువదగినవి, వినదగినవి. కాని తంత్రములు సాధనచేయవలసినవి. హరినామము నోటితో పలుకవలయును; చెవులతో వినవలయును. కొన్ని రోగముల నివారణకై పైకిని మందురాయవలయును, లోపలికిని మందుతినవలసియుండును.

282. నీభావములను, నీభక్తిని రహస్యముగ నుంచుము. బాహాటముగ వచింపకుము. కాదేని నీకు గొప్పనష్టము వాటిల్లును.