పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12వ అధ్యాయము.

ఆధ్యాత్మిక జీవనగతులు.

271. పండ్లతోనిండినచెట్టు క్రిందికివంగియుండును గదా; నీవు ఘనుడవు కాగోరుదువేని నమ్రతతో అణిగియుండుము.

272. త్రాసునందు బరువుగలసిబ్బె క్రిందికివంగును. తేలికగానున్నసిబ్బె పైకిపోవును. అటులనే యోగ్యత సమర్ధత కలవాడు ఎల్లెడల వినయవిధేయతలు చూపుచుండును. బుద్ధిహీనుడో గర్వముతో ఉబ్బిపోవుచుండును.

273. పసిపాపనుబోలి నిరాడంబరము పూననంతవఱకును దివ్యతేజము లభింపబోదు. నీవుగడించిన ప్రాపంచిక విజ్ఞానమంతయు మఱచిపోయి పసివానివలె ప్రజ్ఞవిడిచియున్నచో, నీకు బ్రహ్మజ్ఞానము అలవడును.

274. ఏమారుమూలనో, విజనవనముననో, నిశ్శబ్దమగు నీహృదయగుహయందో భగవధ్యానము సలుపుము.

275. పెనుగాలివీచునప్పుడు ఎండాకువలె స్వాతిశయము విడిచియుండుము.

276. ముఱికితోగూడిన అద్దము సూర్యకిరణములను ప్రతిఫలింపజేయదు. మాయతోగూడిన హృదయముతో అపవిత్రులై యున్న పాపుల భగవన్మహిమను ఎన్నడును కాంచ జాలరు. కాని పవిత్రహృదయులు, నిర్మలమగు అద్దము