పుట:Shodashakumaara-charitramu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

78


వ.

అట్లరిగి యరిగి యత్యంతపథిశ్రాంతి నొంది.

129


క.

[1]లుంగలవంగ.....
.........................నన్ గిరిసరసీ
తుంగతలవనముఁ దూఱి ల
తాంగులు వేస నడఁగి యుండి రచ్చట నంతన్.

130


వ.

చండవిక్రముం డనుమండలనాథుండు సింహవిక్రముం డనుతనయుండునుం దాను నక్కాననంబునకు వేఁట వచ్చి యప్పొలంతులు చనినచొప్పు గాంచి పుత్రు నవలోకించి.


క.

అడుగులు నిడు పగుకాంతయు
నడుగులు కుఱుచ లగునంబుజాక్షియును భయం
బడరఁ జనినారు వీరలఁ
బొడగని (మన)పురికిఁ గొంచుఁ బోయేదమేనిన్.

132


క.

చరణములు నిడుపు లగునా
సరసీరుహనేత్ర నాకు సన్నపుఁ బాదాం
బురుహములయింతి నీకును
[2]గరనీత లటంచు నూత్నకౌతుక మెసఁగన్.

133


క.

చరణంబులచొప్పునఁ జని
సరసీతటికాననమున శ్రమపడిన మనో
హరవనదేవతలో యనఁ
గర మొప్పెడుసతులఁ గాంచి కడుముద మొదవన్.

134


ఉ.

వాడియు నొప్పు సేసె ముఖవారిరుహంబులు ఘంటికావళి
న్వీడియు వేడ్కఁ బెంచె నెఱివేణులు గ్రమ్మెదుఘర్మవారిలోఁ

  1. లుంగలనంగచూతనుల గంద్దములం బెనంగినన్ -మూ.
  2. కరిణీతలలంచు - మూ.