పుట:Shodashakumaara-charitramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


షోడశకుమారచరిత్రము

పీఠిక

ఇది యెనిమిదియాశ్వాసముల పద్యకావ్యము. కాని, మాకు దొరకినప్రతులలోఁ దృతీయ చతుర్థాశ్వాసములు లేవు. ప్రథమాశ్వాసమునఁ గృత్యాది లేదు. అచ్చటచ్చట గ్రంథపాతములు గలవు. మొదటి రెండాశ్వాసములు గలప్రతి యొకదానిని చెన్నపురి బ్ర॥ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పంపిరి. ఈ తాళపత్రప్రతిలో నీరెండాశ్వాసములును ౧౭౪వ పత్రము మొదలు ౧౯౯వ పత్రమువఱకుమాత్రమే యున్నవి. మొదటి ౧౭౩ పుటలలో నేమివ్రాయఁబడియుండెనో యాభాగ మిందు లేదు. రెండవ ప్రతి, ౫-౬-౭-౮ ఆశ్వాసములు మాత్రమే కలిగి ౨౦౫-వ పత్రము మొదలుకొని ౨౪౮ పత్రములు సంఖ్య వేయఁబడి యున్నది. దీనిని, కాకినాడ, మ॥ దుగ్గిరాల వేంకటసూర్యప్రకాశరావుపంతులు బి.ఎ., గా రిచ్చిరి. మొదటి ౧౦౪ పుటలలో పోడశకుమారచరిత్రము ౧-౨-౩-౪ ఆశ్వాసములు మొదలైనవి వ్రాయఁబడి యుండవలెను.

శ్రీమాన్ బహుజనపల్లి సీతారామాచార్యులవారు శబ్దరత్నాకరములో నిందుండి కొన్నియుదాహరణముల నిచ్చి యున్నారు. వారిచ్చిన ప్రయోగము లీముద్రితప్రతిలో నున్న