పుట:Shodashakumaara-charitramu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

161


యుమపాలికన్ను పున్నమఱేఁడు వెన్నుని
        వియ్యంబు తామరవిరులగొంగ
ముక్కంటి తలపూవు చుక్కలయేలిక
        వెన్నెల కందువు వేల్పుబువ్వ
కూడి పాసినవారలగుండెదిగులు
పాసి కలసినివారలపాలియింపు
పొడుపుఁగెంపున నెంతయు బెడఁగు నొంది
మన్మథునిమామ యగుచందమామ వొడిచె.

75


గీ.

పూర్వగిరి పానవట్టమై పొలుపు మిగులఁ
బద్మరాగలింగమువోలెఁ బ్రబలె రాజు
పూజ చేసిననవకంపుఁబూవు లట్టు
లుపరితలమునఁ దారక లొప్పు మిగిలె.

76


చ.

సలలితలీలఁ బ్రాగ్వనితఁ జాలగ రాగముఁ బొందఁ జేసి యిం
పొలయఁ గుముద్వతీసతికి నుల్లసనం బొదవంగఁ జేయుచు
న్విలసితతారకాంగనల వెన్నెలగందపుబూఁతచేతఁ బె
ల్లలరంగఁ జేసె నప్పు డమృతాంశుఁడు దక్షిణనాయకాకృతిన్.

77


(గ్రంథపాతము)

..........సంతోషంబు నిగుడుచుండ
వైభవముతోడ శృంగారవనము సొచ్చి.

78


సీ.

మంజీరమంజులశింజితంబు సెలంగ
        .............................
................లవిందులు చేసి
        పూవుఁదీఁగెలపొంతఁ బొలసి పొలసి