పుట:Shodashakumaara-charitramu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

షోడశకుమారచరిత్రము


నధిక తేజస్వి యగునినుఁ డస్తమింప
దివి యరాజకమై యున్నయవసరమున.

71


ఉ.

తాంతము లైనతామరలతావులు సేవలు దక్కి పోవఁగా
నంతట వచ్చి చొచ్చె మధుపావళి గ్రోలుచు సోలుచుండఁగాఁ
గాంతవనాంతరాంతరనికామనివాసవిజృంభమాణపా
యంతనమల్లికాకుసుమహారిమనోహరసౌరభావలుల్.

72


సీ.

ఇది చనుదెంచెనే నేగరా దనియొక్కొ
        తోయజబంధుండు తొలఁగిపోయె
నిది తను రూపఱఁ బొదలెడు ననియొక్కొ
        రాజు రయంబున రాక తడసె
నిది వెనుదగిలిన నేగరా దనియొక్కొ
        చుక్కలు దీనిలోఁ జొచ్చి వెలసె
నిది మ్రింగు ననియొక్కొ యిప్పుడు దీపరూ
        పమున నిండులు సొచ్చెఁ బవనబంధుఁ
డనఁగ దెస లెల్లఁ గస్తూరి నలఁదినట్లు
మింట నెల్లను గాటుక మెత్తినట్లు
నుర్వి గలయంతయును నీలి నూంచినట్లు
నంతకంతకు నగ్గల మయ్యెఁ దమము.

73


వ.

అయ్యవసరంబున.

74


సీ.

సిరితోడఁబుట్టువు చెంగల్వచెలిపొందు
        ప్రొద్దుసంగడము తన్పునకు నెలవు
చీకటిమూఁకలఁ జెండెడినెఱరౌతు
        మున్నీటి నుబ్బించు ముద్దుఁబట్టి